'అడవి, నీరు, భూమిని కాపాడడమే నిజమైన నివాళి'
ASR: అడవి, నీరు, భూమిని కాపాడడమే బిర్సాముండాకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టీ.సూర్యనారయణ అన్నారు. బుధవారం డుంబ్రిగుడ జూనియర్ కళాశాలలో బిర్సాముండా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడవి ఆదివాసీల హక్కు అని, ఆదివాసీలకు స్వయం పాలన కావాలని ఆయన పోరాటం చేశారన్నారు.