ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల

ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. అర్హులైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల వివరాలను సబ్జెక్ట్ వారీగా ఆన్‌లైన్‌లో ఉంచారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31లోపు సంబంధిత ధ్రువపత్రాలతో డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వినతులు పరిగణించబోవని అధికారులు తెలిపారు.