సీఎంఆర్ఎఫ్ విడుదల ఫైల్‌పై సీఎం తొలి సంతకం
కృష్ణా: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు పేదలకు వైద్య, ఆర్థిక సహాయం అందించే సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.55.63 కోట్లు విడుదల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,787 మంది పేదలకు మేలు జరగనుంది. అనంతరం వేడుకల్లో భాగంగా సీఎం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.