గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KMM: సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ఏరియాలోని జామాయిల్ తోటలో సోమవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నీలం రంగు ప్యాంట్ ధరించి, కుడి చేతికి ఎరుపు రంగు దారం కట్టుకుని ఉన్నాడు. మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండగా మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు 8712659167, 8712551362 సంప్రదించాలని పోలీసులు కోరారు.