VIDEO: Dy. CM పర్యటనను విజయవంతం చేయండి: బీజేపీ
కోనసీమ: ఈ నెల 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మలికిపురం మండలం కేసనపల్లిలో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 12 గ్రామాలలో ఉప్పునీటి కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పవన్ పరిశీలిస్తారని తెలిపారు.