శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
BPT: రేపల్లె పట్టణంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన పందిళ్లలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.