పెదకాకాని మండలంలో విస్కృత పర్యటనలో పాల్గొన్న:అంబటి

గుంటూరు: పెదకాకాని మండలంలో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ విస్కృత ప్రచారం నిర్వహించారు. మండలంలో గడపగడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.