ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌‌కు వినతి

ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌‌కు వినతి

ఏలూరు: మండల కేంద్రమైన ఉంగుటూరు గ్రామంలో ఆధార్ కేంద్రం లేదని, శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉంగుటూరు గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని పీజీఆర్ఎస్‌లో వారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం  అందజేశారు. ఆధార్ ఏర్పాటు కేంద్రంపై ఎంపీడీవో మనోజ్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.