మున్సిపల్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు
E.G: పిఠాపురం మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 14తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావును నియమించింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు మున్సిపాలిటీ పరిపాలనపై మంచి అవగాహన ఉంది. పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత మున్సిపల్ పరిపాలనను ఆయన నిర్వహించనున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపడతారు.