ఈ వృద్ధురాలు అందరికి ఆదర్శం!

ఈ వృద్ధురాలు అందరికి ఆదర్శం!

HYD: కేరళలో ఫుట్‌పాత్‌పై స్కూటీ నడిపిన వ్యక్తిని ఓ వృద్ధురాలు అడ్డుకున్న తీరు అమోఘమని ఐపీఎల్ CV ఆనంద్ ట్వీట్ చేశారు. నంబర్ ప్లేట్ ఫోటో తీసి అతన్ని రోడ్డుపైకి పంపించింది. ట్రాఫిక్ నియమాల పట్ల సామాజిక బాధ్యత చూపిన ఈ సంఘటన మనందరికీ ఆదర్శం. కేవలం పోలీసులపై ఆధారపడకుండా మనమూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. HYDలో CV ఆనంద్ సీపీగా విధులు నిర్వహించారు.