విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేత
SKLM: విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీలలో గెలుపు పొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశామని ఎంఈVO ఎం వెంకటరమణ తెలిపారు. బుధవారం సారవకోట మండల కేంద్రంలో భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాల వివరాలను తెలియజేశారు.