మహమ్మద్ షమీకి మళ్లీ నిరాశే
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీలో షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో ఈసారి అతడికి జట్టులో స్థానం దక్కడం ఖాయమనుకున్నారు. కానీ, షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.