VIDEO: శిథిల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: శిథిల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. శిథిలమైన పరిస్థితిలో ఉన్న భవనాలను తొలగించి ప్రజాప్రయోజనాలకు వినియోగించేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో ఆయన చర్చించారు. శిథిల భవనాల తొలగింపు అనుమతుల కోసం నివేదికలను పంపించాలని అధికారులను ఆదేశించారు.