శ్రీవారి మేల్చట్ వస్త్రాలకు రూ. 43 లక్షలు విరాళం

TPT: తిరుమల శ్రీవారికి ఒక సంవత్సరం పాటు వినియోగించే 55 సెట్ల మేల్చట్ వస్త్రాల కోసం అయ్యే రూ.43.45 లక్షలను బుధవారం శ్రీ కాశీమఠం మఠాధిపతి శ్రీమద్ సమ్యమీంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆ మఠం ప్రతినిధి కే. నారాయణ షెనోయ్ అనే భక్తుడు విరాళంగా అందించారు. ఈ మేరకు రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ. ఆర్. నాయుడుకు అందజేశారు.