నేడు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండలం పామి రెడ్డి పల్లిలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారని ఐకెపీ ఎపీఎం సక్రనాయక్ తెలిపారు. వనపర్తి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు.