ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

NGKL: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తర్నికల్‌కు చెందిన డేరంగుల వెంకటయ్య(45) గ్రామం నుంచి కల్వకుర్తి వైపు ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.