జాబ్ మేళాకు విశేష స్పందన.. 54 మంది షార్ట్ లిస్ట్
KNR: ITటవర్‌లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 209 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా, 54 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరికి త్వరలో తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.