VIDEO: 'పోలీస్ ప్రజా వేదికకు 110 ఫిర్యాదులు'
VSP: విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖా బ్రాతా భాగ్చి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 110 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ స్వయంగా బాధితుల సమస్యలు విని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కింది స్థాయి అధికారులకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. వీటిలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు.