రైతులకు నమ్మకం కలిగేలా సర్వే చేయాలి: కలెక్టర్

రైతులకు నమ్మకం కలిగేలా సర్వే చేయాలి: కలెక్టర్

SRPT: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా లైసెన్స్‌డ్ సర్వేయర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లతో ఆయన మాట్లాడారు. ధరణి, భూభారతి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన కొలతలు వేసి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. జిల్లాను భూ రికార్డుల నిర్వహణలో ముందుంచాలని ఆయన పిలుపునిచ్చారు.