మహిళా సంఘాలకు భారీ ఆర్థిక ప్రోత్సాహం
NRML: మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రుణాలు అందిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో మెప్మా స్వయం సహాయక సంఘాలకు రూ.2.72 కోట్ల వడ్డీ రహిత రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని మహిళలకు సూచించారు.