ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

NLG: గుర్రంపోడు మండలం లక్ష్మీదేవిగూడెం కొనుగోలు కేంద్రం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళనకు దిగారు. లారీల కొరతతో రోజలు తరబడి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. కొనుగోలు కేంద్రం పక్కన నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.