చేబ్రోలులో స్వచ్ఛ రథం ప్రారంభించిన ఎమ్మెల్యే
GNTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చేబ్రోలు గ్రామపంచాయతీకి మంజూరైన స్వచ్ఛ రథం వాహనాన్ని పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ శనివారం ప్రారంభించారు. అధికారులు, పార్టీ నాయకులతో కలిసి వాహనానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంలో ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు.