'హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదు'
SKLM: నేరేడు బ్యారేజీతో పాటు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శ్రీకాకుళం సీపీఎం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. వంశధార, ఆఫ్షోర్, కొండపేట లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుందన్నారు. నేరేడు బ్యారేజీకి రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదన్నారు.