తండ్రి మందలించాడని ఆత్మహత్య

తండ్రి మందలించాడని ఆత్మహత్య

ప్రకాశం: తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది. పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి ఇంటి పక్కన ఉన్న కాశీరాజు ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం చేశాడని తండ్రి మందలించాడు. దీంతో బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయి గుంటూరు వెళ్ళే రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.