VIDEO: జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్
WNP: యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించి, ముందుకు సాగాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు.