'రోడ్డు భద్రత నియమాలను పాటించాలి'

'రోడ్డు భద్రత నియమాలను పాటించాలి'

మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద అరైవ్, ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత పట్ల వాహనదారులకు పట్టణ సీఐ మహేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అన్నారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడంతో మీ కుటుంబం రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.