ప్రేమ, అంకితభావమే BJPకి ఆలంబన: పవన్
AP: దేశంపై ప్రేమ, ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా BJP ముందుకు సాగుతోందని Dy.CM పవన్ పేర్కొన్నారు. BJP 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ చీఫ్ నితిన్ నబీన్, PM మోదీ, కేంద్రహోంమంత్రి అమిషాతో పాటు కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థవంతమైన విధానాలు అమలు చేస్తూ తనదైన ముద్ర వేసిందన్నారు.