బీఎం కార్యాలయం ఎదుట 'వంటావార్పు'

బీఎం కార్యాలయం ఎదుట 'వంటావార్పు'

ASR: కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ కోరారు. గురువారం కాఫీ కార్మికులతో కలిసి చింతపల్లి జీసీసీ బ్రాంచ్ మేనేజర్ కార్యాలయం ఎదుట 'వంటావార్పు' కార్యక్రమం నిర్వహించి, నిరసన తెలిపారు. వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనివల్ల సంస్థకు నష్టం జరుగుతుందన్నారు.