'రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులకు సహకరించాలి'
VZM: గంట్యాడ తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి శనివారం తమ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు సహాకరించాలని కోరారు. సకాలంలో రైతులకు గోనె సంచులు అందజేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో వాడుతున్న తేమశాతం లెక్కించే మిషన్లు వినియోగించాలని ఆదేశించారు.