రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సత్యసాయి రైస్ మిల్లును అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి FCIకి సమర్పించవలసిన CMR బియ్యాన్ని వేగంగా అందించాలని మిల్లర్లను ఆదేశించారు. ప్రతిరోజు ఒక ఏసీకే ధాన్యాన్ని సమర్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.