సైబర్ మోసాలపై అయిలాపూర్‌లో అవగాహన

JGL: అయిలాపూర్ గ్రామంలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కథలాపూర్ బ్రాంచ్ ఆఫీసర్ నవీన్ మాట్లాడుతూ.. ATM కార్డ్ స్కిమ్మింగ్, స్క్రీన్ షేరింగ్ యాప్స్, సిమ్ కార్డ్ వివరాలు, QR కోడ్, క్రజెడిట్ కార్డ్ ఫీజు రాయితీ, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఫిషింగ్ కాల్స్, ఇమెయిల్ మోసాల గురించి వివరించారు.