VIDEO: మంచంతోపాటే స్కూల్‌కు..
కొందరు పిల్లలు స్కూల్‌కు వెళ్లమని మంకుపట్టు పడతారు. వాళ్లకు సర్దిచెప్పి స్కూల్‌కు పంపించడానికి తల్లిదండ్రులకు తలప్రాణం తోకకువస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ బాలుడు స్కూల్‌కు వెళ్లనని మారం చేసి మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతన్ని మంచంతోపాటే స్కూల్ దగ్గరకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో Xలో వైరల్‌గా మారింది.