సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లోనే వేయాలి

ఖమ్మం: బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలోని వార్డుల్లో సేకరిస్తున్న తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల్లోనే వేసే విధంగా పంచాయతీ సిబ్బంది, సంబంధిత పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రతిక్ జైన్ అధికారులకు ఆదేశించారు. శనివారం సారపాక పంచాయతీలో పర్యటించారు.