ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం వివాహ వేడుకలలో పాల్గొననున్నారు.