సీఎం స్వగ్రామం.. ఏకగ్రీవం..?

సీఎం స్వగ్రామం.. ఏకగ్రీవం..?

TG: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తు చేపట్టారు. ఈ దఫా సర్పంచి స్థానం SCకి రిజర్వైంది. దీంతో గ్రామస్థులంతా సర్పంచిగా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. వార్డు సభ్యులకు కూడా ఒక్కో నామినేషన్‌ దాఖలు చేయించనున్నారట.