ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సింహాచలంలో ప్రమాదం

NTR: సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో చందనోత్సవాలలో జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు సరైన పరిరక్షణ లేదని విమర్శించారు. చెత్త వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకువెళ్లిన వైనం కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుందని విమర్శించారు.