మరో 13 చెరువుల అభివృద్ధికి హైడ్రా ప్రణాళిక!

HYD నగరంలో హైడ్రా 6 చెరువుల అభివృద్ధిని చేపట్టింది. అంబర్‌పేట బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు పలుమార్లు సందర్శించి అక్కడ హైడ్రా చర్యలను అభినందించాయి. మరో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది.