అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం

GNTR: కొల్లి శారదా మార్కెట్‌లో దుకాణాలు పొందిన వారికి వాటిని కేటాయించడానికి GMC స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని గుంటూరు మేయర్ రవీంద్ర అన్నారు. గురువారం మేయర్ ఛాంబర్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో రూ. 19 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూడా కమిటీ ఆమోదం తెలిపిందని మేయర్ తెలిపారు.