నిజాయితీ చాటుకున్న గుంతకల్లు హెడ్ కానిస్టేబుల్

నిజాయితీ చాటుకున్న గుంతకల్లు హెడ్ కానిస్టేబుల్

ATP: గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం హెడ్ కానిస్టేబుల్ బాబా మునవార్ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సు ఎక్కే క్రమంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్ కె. ఎస్. గణేశ్ పోగొట్టుకున్న రూ. 6 వేలు నగదు ఉన్న పర్సును ఆయన తిరిగి అప్పగించారు. పర్సులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా జవాన్‌ను సంప్రదించి, డబ్బును తిరిగి ఇవ్వడంతో మునవార్‌ను అందరూ ప్రశంసించారు.