పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
జగిత్యాల పట్టణంలోని శారదా విద్యా నిలయం 1999-2000 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం 25 సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.