ఢిల్లీ పేలుడు కుట్రదారుడిపై ఎన్ఐఏ రిపోర్టు
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో పట్టుకున్న జాసిర్ బిలాల్ డ్రోన్ల వినియోగంలో నిష్ణాతుడని NIA తెలిపింది. రాకెట్ల తయారీలోనూ అతడు నిపుణుడని చెప్పింది. పేలుడు ఘటనలో టెక్నికల్ సపోర్టు ఇచ్చినందుకే అతడిని అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు 10 రోజుల కస్టడి కోరుతూ తన ప్రాథమిక రిపోర్టును సమర్పించింది. డా. ఉమర్ వద్ద చాలా క్లోజ్‌గా పని చేసినట్లు గుర్తించింది.