తహసీల్దార్ చేతుల మీదుగా రెండో విడత యూరియా పంపిణీ

VZM: వేపాడ రైతు సేవా కేంద్రంలో రెండో విడత యూరియా పంపిణీ కార్యక్రమాన్ని తాసిల్దార్ రాములమ్మ సోమవారం ప్రారంభించారు. రెండో విడతగా 12 టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. రైతులకు ఏవో స్వాతి యూరియాను పంపిణీ చేస్తున్నారు. యూరియా పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలని తాసిల్దార్ సూచించారు. పోలీసుల బందోబస్తు నడుమ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.