‘స్వామిత్వ సర్వేను వేగవంతం చేయండి’

అన్నమయ్య: మండలంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని నిమ్మనపల్లె ఎంపీడీవో రమేశ్ బాబు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో స్వామిత్వ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రాజు వేటి వారిపల్లె, రెడ్డి వారిపల్లె, బండ్లపై గ్రామాల్లో సర్వే మందకొడిగా సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.