పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మూల్యాంకన పుస్తకాలపై ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టిలో పెట్టారు. పాఠశాల పనివేళ్లలో మూడు రోజుల్లో పూర్తిచేయడం కష్టం అని అసహనం వ్యక్తం చేశారు.