కారును ఢీకొన్న లారీ... ఐదుగురికి తీవ్ర గాయాలు

KMM: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన ఇవాళ కామేపల్లి మండలంలో చోటు చేసుకుంది. బల్లేపల్లి నుంచి ఇల్లెందు వైపు ఓ కారును పండితాపురం సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కవిత, చిట్టిబాబు, విజయ, సత్యవతి, సుశీలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.