చంద్రబాబును కలిసిన నారాయణపురం మాజీ సర్పంచ్

ప.గో: రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు, నారాయణపురం మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి టీడీపి అధినేత చంద్రబాబు నాయుడును పాలకొల్లులో శనివారం కలిశారు .ఈ సందర్భంగా ఉంగుటూరు ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసిన ధర్మరాజు గెలుపునకు విశేషంగా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారని నాగమణి పేర్కొన్నారు. ఉంగుటూరు అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు.