అక్రమ మద్యం విక్రయంపై ఉక్కుపాదం

అక్రమ మద్యం విక్రయంపై ఉక్కుపాదం

KDP: కలసపాడు మండలం చింతలపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకిందపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టాప్పై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం SI సుభాన్ తనిఖీల్లో భాగంగా సగిలి సుశీలమ్మ వద్ద అమ్మకానికి ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ. 1300 అని SI తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూన్నారు.