పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

VZM: రామభద్రపురం(M) పరిధి శ్రీరామనగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్ (44) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై వెలమల ప్రసాదరావు తెలిపారు. ఈనెల 15వ తేదీన కడుపునొప్పి తాళలేక చిన్నమ్మతల్లి గుడి దగ్గర పురుగు మందు తాగినట్లు గుర్తించిన బంధువులు బాడంగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు.