పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ

NZB: సాలూర మండలంలో కొనసాగుతున్న రెండవ సాధారణ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ గురువారం పర్య వేక్షించారు. మండలంలోని 9 గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది విధులను, బందోబస్తు నిర్వహణను సీఐ పరిశీలించారు.