సాయం చేయబోతే దొంగ అని తేలింది!

HYD: బేగంపేటకు చెందిన శివ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ ఆటోలో కార్మికనగర్ నుంచి ఇంటికి వెళుతుండగా ఓవ్యక్తి బైక్‌ను తోసుకుంటూ వెళుతున్నాడు. పాపం సాయం చేద్దామని ఆటో నడుపుతూ కాలితో ముందుకు తోస్తున్నాడు. ఈ క్రమంలో అతని బైక్‌క్కు కీ లేకపోవడంతో దొంగ అని అనుమానం వచ్చి అడగ్గా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.